ఘనంగా గ్రాడ్యుయేషన్‌ డే

May 14,2024 23:23
సూరంపాలెం ఆదిత్య

ప్రజాశక్తి – గండేపల్లి

సూరంపాలెం ఆదిత్య గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ డేను ఘనంగా నిర్వహించారు. అదిత్యలో (2020 -2023)ఐఎంబిఎ, బిబిఎ, ఎంబిఎ ఉత్తీ ర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులు వారి తల్లిదం డ్రులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిఎస్‌ఎల్‌ అధినేత డాక్టర్‌ గన్ని భాస్కర్‌రావు, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్‌ సుగుణారెడ్డి, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సంజరుకుమార్‌ పాల్గొని మాట్లాడారు. డిగ్రీ పట్టాతోపాటు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించారు. అనంతరం స్వర్ణ పతకం పొందిన విద్యార్థినీ, విద్యార్థులను వారి తల్లి దండ్రులను డా .గన్ని భాస్కర్‌, డైరెక్టర్‌ సుగుణా రెడ్డి ఘనంగా సన్మానించారు.

➡️