విస్తారంగా కురుస్తున్న వర్షాలు

May 16,2024 12:18 #Kakinada

ప్రజాశక్తి-కోటనందూరు: తుని, కోటనందూరు మండలాల్లో గురువారం నాడు ఉదయము నుండి విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. తుని, డి. పోలవరం అల్లిపూడి, కాకరాపల్లి, నందికొంపు, భీమవరపుకోట కె, ఈ చిన్నయ్యపాలెం, రాపాక గ్రామాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. గత నాలుగు నెలల కాలం నుండి వర్షాలు కురవడం వల్ల భూములన్ని ఎండిపోయి బీటలు వారాయి. మే మొదటి వారం నుండి వర్షాలు ప్రారంభం అవడంతో మెట్ట ప్రాంత రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని పశువులకు పశుగ్రాసము కొరత తీరుతుందని రైతులు అన్నారు. ఈ వర్షాల వల్ల డ్రైనేజీ లేని వీధి రోడ్డులో రోడ్డుపై మురుగునీరు నిలవండిపోవడంతో రోడ్డుపై నడవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

➡️