పుట్టినరోజు వేడుకలో పేదలకు సహాయం

Feb 11,2024 13:10 #Kakinada
Help the poor in birthday celebration

ప్రజాశక్తి – తాళ్లరేవు : పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు, తెదేపా నాయకులు చీకట్ల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు స్థానిక యువకులు, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముమ్మిడివరం నియోజకవర్గం తెదేపా పదవ క్లస్టర్ ఇంచార్జ్ మోపూరి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాగేశ్వరరావు కనబరిచే ఉద్యమ స్ఫూర్తి ఆదర్శనీయమని అన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు చేసిన పలు సామాజిక కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది పేద మహిళలకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మిత్రులు, అభిమానులు, నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి స్థానిక చిన్నారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకర రామచంద్రరావు, తాత పూడి నాగేశ్వరరేవు, శ్రీలక్ష్మి గణపతి వర్తక సంఘం ప్రెసిడెంట్ నామా గోపాల కృష్ణ , ఆటో యూనియన్ ప్రెసిడెంట్ విత్తనాల ఈశ్వరరావు, ప్రసాద్ పాల్గొన్నారు.

➡️