ప్రకృతి సాగుతో అధిక దిగుబడులు

Feb 4,2025 22:35
దిగుబడులను సాధించవచ్చునని

ప్రజాశక్తి – పిఠాపురం

ప్రకృతి సేద్యంతో రైతులు అధిక దిగుబడులను సాధించవచ్చునని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.విజరుకుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని పి.తిమ్మాపురం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సేద్యం తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధింస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయ సేద్య పద్ధతులను, సమీకృత సేంద్రియ వ్యవసాయం, సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం, వరి పంటను ఆశించు చీడపీడలు వాటి నివారణ పద్ధతులను ఆయన వివరించారు. నూతన వ్యవసాయ పద్ధతులలో డ్రోన్‌ ఆవశ్యకత, గ్రూపుల ద్వారా ఆర్‌ఎస్‌కెల పరిధిలో సబ్సిడీపై డ్రోన్‌ల సరఫరా, మొదలైన వాటిపై కూలంకషంగా రైతులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శర్మ, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సహాయ సంచాలకులు మాధవి, పిఠాపురం సహాయ వ్యవసాయ సంచాలకుల పి.స్వాతి, మండల వ్యవసాయాధికారి ఎ.అచ్యుతరావు, రైతులు పాల్గొన్నారు. అనంతరం క్షేత్ర సందర్శన చేసి వరి పంటను పరిశీలించారు.

➡️