మానవ మనుగడ పర్యావరణతోనే సాధ్యం

Jan 18,2025 23:22
ఆధారపడి ఉందని లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు,

ప్రజాశక్తి – ఏలేశ్వరం

భవిష్యత్‌ తరాల మనుగడ పర్యావరణ పరిరక్షణపైనే ఆధారపడి ఉందని లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు, పర్యావరణ సంఘం ఉపాధ్యక్షుడు అనసూయ నాగేశ్వరరావు అన్నారు. ప్రకృతి పరిరక్షణ సంఘం అధ్యక్షుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ సఖిరెడ్డి విజయబాబు 72వ పుట్టినరోజు పురస్కరించుకుని సంఘం సభ్యులు ఏలేశ్వరంలో పలు సేవా కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. పలు కూడళ్లలో మొక్కల నాటి అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సమ్మెట శ్రీను కుటుంబానికి నగదు, బియ్యం నిత్యవసరాలు అందజేశారు. అనంతరం నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ప్లాస్టిక్‌ రహిత సమాజానికి కృషి చేయాలని కమిషనర్‌ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి గోళ్ళ నాగేశ్వరరావు, జ్యోతుల నాగసత్యశ్రీనివాస్‌, తాళ్లూరి గొల్లాజిరావు, డివివి.సత్యనారాయణ, కరోతు సత్యనారాయణ, గొల్లపూడి గణేష్‌, ముత్యాల గంగరాజు, రౌతు సహదేవుడు, నారాయణరావు పాల్గొన్నారు.

➡️