ప్రజాశక్తి – కాకినాడ
అంతర్ కళా శాలల జూడో టోర్నీలో ఐడియల్ డిగ్రీ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను చాటుకున్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్ కళాశాలల జూడో పోటీలు తాడేపల్లిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ పోటీల్లో ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ డిగ్రీ కళాశాల క్రీడాకారులు మహిళల విభాగంలో వి.ఉషా నాగబాల, ఎస్‌ఎస్‌ఎన్. తేజస్విని, కె.వైష్ణవి విజేతలుగా నిలిచి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచారు. పురుషుల విభాగంలో టి.పవన్‌కుమార్ గోల్డ్ మెడల్, ఇ.విజరు, పి.హరికిరణ్ కాంస్య పతకాలు సాధించారు. కళాశాలలో మంగళవారం జరిగిన అభినందన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్.పి. చిరంజీవినికుమారి క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్. టి.సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి.స్టీవెన్‌రాజు, కామర్స్ హెడ్ వి.నాగేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ పి.శ్రీను, పలువురు అధ్యాపకులు క్రీడాకారులను అభినందించారు.