ప్రజాశక్తి – ఏలేశ్వరం
ఏలేశ్వరం డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ ఎస్‌వి.రమణ అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ కార్మిక జెఎసి చేపట్టిన ఆందోళన గురువారానికి 20వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జెఎసి నాయకులు కె.త్రిమూర్తులు, యుబిఎం.కుమార్, నేకూరి ప్రసాద్ మాట్లాడుతూ గత 20 రోజులుగా కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం దారుణమన్నారు. టిన్ డ్రైవర్స్ వద్ద రూ.200 పైగా తేడా వస్తే ఐదు రెట్లు అధికంగా జరిమానా వేయాలనే నిబంధనను తుంగలోకి తొక్కి కక్షపూరితంగా డ్రైవర్‌ను సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఆర్‌టిడి చట్టం 1/2019కు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఏలేశ్వరం డిపో మేనేజర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, డ్రైవర్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్, ఎన్‌ఎంయు, యునైటెడ్ వర్కర్స్ యూనియన్‌లకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.