ఇండియా బ్లాక్‌ మెరుగుదల హర్షణీయం

Jun 10,2024 22:39
ఇటీవల జరిగిన లోక్‌సభ

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

ఇటీవల జరిగిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి పుంజుకోవడం దేశం కాస్త ఊపిరి పీల్చు కుందని, ప్రజలు ఆలోచనాపరులనే విషయం తేటతేల్లడమవుతోందని, ప్రజల తీర్పు హర్షణీ యంగానే ఉందనే పలువురు అభిప్రాయ పడ్డారు. స్థానిక ఇంద్రపాలెంలో విఎస్‌ఆర్‌ ఐడియల్‌ స్టడీ సెంటర్‌ నిర్వహించిన ‘దేశ సార్వత్రిక, ఎపి జమిలి ఎన్నికలు’ అనే అంశం పై చర్చాగోష్టిని నిర్వహించారు. ఈ చర్చాగోష్టిలో పలువురు పాల్గొని తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశంలో అత్యధిక మంది హిందువులు సైతం హిందుత్వాన్ని తిరస్కరించి లౌకిక దేశానికి కోరుకుం టున్నారని ఈ తీర్పు చెబుతుందన్నారు. దేశ ప్రజలు ఏ మతతత్వానికి లొంగుబాటు కాకుండా దేశ సమైక్యతను కాంక్షిస్తూ ఓటు వేయడం మొదలు కావడం సంతోష మన్నారు. మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో సైతం లౌకిక పార్టీలతో ప్రజలు చేయి కలపడం గొప్ప పరిణామన్నారు. తమిళనాడు పెరియార్‌ రామస్వామి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తీర్పు చెప్పిందని, రాబోయే కాలంలో పౌర సమాజం మరింత జాగురకతతో, పట్టుదలగా లౌకిక భావజాలాన్ని, మత సామరస్యాన్ని, పెంపొదింస్తూ, ఆర్‌ఎస్‌ఎస్‌ విచ్ఛిన్నకర రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం నిరంతరం చేస్తూ దేశభక్తితో ముందుకు సాగి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వర రావు, సామాజిక కార్యకర్త పెద్దింశెట్టి రామకృష్ణ, పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌ దూసర్లపూడి రమణరాజు, హసన్‌ షరీఫ్‌, ఉద్యోగ సంఘాలు నాయకులు రవి, శశి, యుటిఎఫ్‌ నాయకురాలు సోనీ, తేజ, కుమారి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సాహిత్‌, రోహిత్‌, వాసు, సూర్జిత్‌, ప్రజా సంఘాలు నాయకులు విజరుకుమార్‌, చంద్రరావు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

➡️