ముద్రగడ ఇంటిపై దాడి అమానుషం 

Feb 3,2025 15:41 #Kakinada district

ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ): మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి అమానుష చర్య అని మాజీ జెడ్పిటిసి శిడిగం వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక వైకాపా నేత బదిరెడ్డి గోవింద్ నివాసంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీనియర్ నాయకుడు ముద్రగడ ఇంటి గేటులను గుద్దుకుంటూ కారును, ఫ్లెక్సీలను ధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ముద్రగడ కు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారని ఇటువంటి చర్యలు పునరావృతం అయితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బదిరెడ్డి గోవింద్ బాబు, సుంకర రాంబాబు, ఎంపీటీసీ ఇజనగిరి ప్రసాద్, వైకాపా నాయకులు జువ్వెన వీర్రాజు, పైల విజయ్, సిరిపురపు రాజేష్, గోళ్ళ నాగేశ్వరరావు, గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, వాగు బలరాం ఉన్నారు.

➡️