జీడి పిక్కల ఫ్యాక్టరీ కార్మికుల వినూత్న నిరసన

Nov 28,2024 22:25
కార్మికులు వినూత్న రీతిలో గురువారం

ప్రజాశక్తి – ఏలేశ్వరం

జీడిపిక్కల ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతూ కార్మికులు వినూత్న రీతిలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. పరిశ్రమ వద్ద జరుగుతున్న నిరసన శిబిరంలో కార్మికులు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రత్తిపాడు మండల కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఫ్యాక్టరీని నమ్ముకుని పనిచేస్తున్న 409 మంది కార్మికులు ఫ్యాక్టరీని మూసేయడం వల్ల ఉపాధి కోల్పోయారన్నారు. ఉపాధి కోసం ఎక్కడకు పోవాలో తెలియని స్థితి కార్మికులు ఉన్నారని అన్నారు. గత 13 రోజులుగా పరాశ్రమ వద్ద కార్మికులు తమ ఆవేదనను వివిధ రూపాల్లో తెలియ చేసినా ప్రభుత్వం, అధికారులు, యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు. ఈ ఆందోళనకు సిఐటియు గొల్లప్రోలు మండల కార్యదర్శి ఓరుగంటి నందేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు అనిశెట్టి వీరబాబు, కె చక్రధర్‌, ఎం.చంటి, సిహెచ్‌ గోవింద్‌, ఎస్‌.విజయలక్ష్మి, టి.దేవి, బి.అన్నపూర్ణ నాయకత్వం వహించారు.

➡️