ప్రజాశక్తి – పిఠాపురం, గొల్లప్రోలు
ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎంఎల్‌ఎ కొణిదల పవన్‌కళ్యాణ్ పర్యటించే ప్రాంతాలను కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి మంగళవారం పరిశీలించారు. పిఠాపురం మండలంలోని మల్లం గ్రామంలోని గోకులం, విరవాడ, పట్టణంలోని ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్ జూనియర్ కళాశాల, పురపాలక ఉన్నత పాఠశాల మైదానం, కుమారపురం గోకులాలను పరిశీలించారు.ఈ పర్యటనలో జడ్‌పి సిఇఒ వివివిఎస్.లక్ష్మణరావు, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, డిపిఒ వి.రవికుమార్, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్.సూర్యప్రకాష్‌రావు పాల్గొన్నారు. గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు జడ్‌పి ప్రాథమిక ప్రభుత్వ కళాశాల ప్రాంగణాన్ని కలెక్టర్ షాన్‌మోహన్ పరిశీలించారు. అలాగే నిర్మాణంలో ఉన్న రెవెన్యూ కార్యాలయాన్ని, అర్బన్ హెల్త్ సెంటర్, తాడిపత్రిలోని బోరువెల్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు పారదర్శకంగా జరగాలని, అర్బన్ హెల్త్ సెంటర్‌కు రంగులు కూడా వేయాలన్నారు. ఈ పర్యటనలో తహశీల్దార్ కెవి.సత్యనారాయణ, ఎంపిడిఒ కె.స్వప్న. మున్సిపల్ కమిషనర్ ఎన్.కనకారావు, డిఇ గంగరాజు, ఎఇ సురేంద్ర, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.