పూడిక తీత పనుల పరిశీలన

Jan 15,2025 22:03
డ్రెయినేజీలో చేపట్టిన పూడికతీత

ప్రజాశక్తి – సామర్లకోట

స్థానిక మఠం సెంటర్లో జరుగుతున్న మేజర్‌ డ్రెయినేజీలో చేపట్టిన పూడికతీత పనులను ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఏళ్ళు తరబడి పేరుకుపోయిన పూడికను జెసిబి తొలగిస్తుండగా పనులను పరిశీలించి స్థానిక పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. పూర్తిస్థాయిలో మేజర్‌ డ్రెయిన్‌లలో పూడికలు తొలగించి వర్షాకాలంలో జలాల ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, గౌడా డైరెక్టర్‌ బడుగు శ్రీకాంత్‌, భీమేశ్వరాలయ ధర్మకర్తల మండలి మాజీ ఛైర్మన్‌ కంటే జగదీశ్‌మోహన్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ గోలి వెంకటఅప్పారావుచౌదరి పాల్గొన్నారు.

➡️