ప్రజాశక్తి – పెద్దాపురం
స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో శనివారం మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేదుల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి కె.దీప దైవకృప పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సులో సైబర్ క్రైమ్, డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్, విద్యా హక్కులు, మోటార్ వెహికల్ యాక్ట్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, దేశభక్తి, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, బాల్యవివాహాల నిర్మూలన చట్టం, సిఆర్‌పిసి మెయింటినెన్స్ యాక్ట్, గరల్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, క్రిమినల్ పీనల్ కోడ్ తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ కె.రామకృష్ణయ్య, పలువురు న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, నవోదయ ఎన్‌సిసి ఆఫీసర్ సనపల సత్యనారాయణ, ఉపాధ్యాయులు చక్రవర్తి పాల్గొన్నారు.