ఇటీవల మృతి చెందిన సిపిఎం నాయకురాలు కుడుపూడి రాఘవమ్మకు పలుచోట్ల పార్టీ నాయకులు గురువారం ఘనంగా నివాళులర్పించారు. ప్రజాశక్తి-యంత్రాంగంకాకినాడ సిపిఎం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ సభ్యురాలిగా కుడుపూడి రాఘవమ్మ చేసిన సేవలు చిరస్మరణీయమని పార్టీ జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు కొనియాడారు. సుందరయ్య భవన్‌లో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాఘవమ్మ సంతాపసభ నిర్వహించారు. పార్టీ జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో తొలుత కరణం ప్రసాదరావు, జి.బేబిరాణి రాఘవమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ మహిళా సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల కార్యాచరణలో రాఘవమ్మ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంఓల సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కెఎస్.శ్రీనివాస్, కోనేటి రాజు, వల్లు రాజు బాబు, కుంచే మణి, సిహెచ్.రాజ్‌కుమార్, నగర కన్వీనర్ పలివెల వీరబాబు, సభ్యులు కె. సత్తిరాజు, మలకా వెంకట రమణ, సిహెచ్.అజరు కుమార్, టి.రాజా, పి.రామకష్ణ, చంద్రమళ్ల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, ఎం.హరనాధ్, కె.వీరబాబు, కె.సింహాచలం, జి.భూలక్ష్మి, సంజరు, విపిన్ కుమార్ పాల్గొన్నారు.సామర్లకోట రాఘవమ్మ మృతి శ్రామిక వర్గాలకు తీరని లోటని సిపిఎం నాయకుడు కరణం ఏడుకొండలు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. క్రమశిక్షణతో ఎలా ఉండాలని ఆమెను చూసి తాము నేర్చుకున్నామన్నారు. పెద్దాపురం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో దారపు రెడ్డి కృష్ణ అధ్యక్షతన రాఘవమ్మ సంస్మరణ సభలో సిపిఎం మండల కార్యదర్శి దారపు రెడ్డి క్రాంతి కుమార్ మాట్లాడారు. తొలుత ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దారపురెడ్డి సత్యనారాయణ, రొంగల వీర్రాజు, సుబ్బలక్ష్మి, దారపురెడ్డి కృష్ణ, గడిగట్ల సత్తిబాబు, గరగపాటి పెంటయ్య, నెక్కల నరసింహమూర్తి, కూనిరెడ్డి అరుణ, చల్లా విశ్వనాథం, సిరపరపు శ్రీనివాస్, యాసలపు రమేష్, పి.సత్య పాల్గొన్నారు.