ప్రజాశక్తి – కాకినాడ
ఐఎఎస్ అధికారిగా చిరస్మ రణీమైన సేవలు అందించిన ఆదర్శ నీయుడు ఎస్‌ఆర్. శంకరన్‌కు వామ పక్షాలు ఘనంగా నివాళులర్పించాయి. సోమవారం కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న శంకరన్ విగ్రహానికి దళిత ఉద్యమకారులు అయితాబత్తుల రామేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు డేగా ప్రభాకర్, సిపిఎం జిల్లా నాయకులు ఎం.రాజ శేఖర్, కెఎస్.శ్రీనివాస్, న్యూ డెమోక్రసీ నాయకులు జె.వెంకటేశ్వర్లు, గుబ్బల ఆదినారాయణ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజికంగా ఉన్నత తరగతిలో జన్మించిన శంకరన్ ఐఎఎస్ అధికారిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్, సాంఘిక సంక్షేమ వసతి గహాలు, 1/70 చట్టం, వంటి అనేక చట్టాల రూపకల్పనలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని గుర్తు చేశారు. నక్సలైట్స్ ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా కాకుండా రాజకీయ, ఆర్ధిక, సామాజిక సమస్యగా చూడాలని, ప్రభుత్వం చర్చలు జరపడానికి శంకరన్ మధ్యవర్తిగా వ్యవహరించారని కొని యాడారు. ఈ కార్య క్రమంలో నాయకులు పలి వెల వీరబాబు, మలక వెంకటరమణ, టి.నాగేశ్వర రావు, సిహెచ్.పద్మ, ఎన్.ఈశ్వరి, రాణి, తోకల ప్రసాద్, కె.వీరబాబు, ఎంవి.రమణ, సిహెచ్. అజరుకుమార్, మేడిశెట్టి వెంకటరమణ, టి.రాజా, ఏడుకొండలు, పి.రామకృష్ణ పాల్గొన్నారు.