రాజ్యాంగం స్ఫూర్తిని కొనసాగిద్దాం

Nov 26,2024 23:28
వేడుకలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి

ప్రజాశక్తి – యంత్రాంగం

కాకినాడ కలెక్టరేట్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి కలెక్టర్‌ షాన్‌మోహన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి సిఇఒ వివివిఎస్‌.లక్ష్మిణరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ ఎన్‌వివి.సత్యనారాయణ, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, సిపిఒ పి.త్రినాథ్‌ పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అలాగే ఎంఎస్‌ఎన్‌ చారిటిస్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చారిటీస్‌ ఛైౖర్మన్‌ మల్లాడి కార్తీక్‌ నాయకర్‌ మాట్లాడారు. ఈ కార్య్కరమంలో ఎస్‌.ఎన్‌ చారిటీస్‌ సహాయక కమిషనర్‌, కార్యనిర్వహణా ధికారిణి కె.విజయలక్ష్మి, సాంఘీక శాస్త్ర ఉపాధ్యా యులు సిహెచ్‌.శ్రీహరిరావునాయుడు, హెచ్‌ఎం ఎంఎస్‌.సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సామాజిక న్యాయ సాధన సమితి, యునైటెడ్‌ ఎస్‌సి, ఎస్‌టి ఫోరం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని స్థానిక ఇంద్రపాలెం అంబేద్కర్‌ కాంస్య విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ కె బాబ్జి, సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్‌ భానుమతి, దళిత సంఘ నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ మోకా పవన్‌కుమార్‌ సంఘ నాయకులు తుమ్మల నూకరాజు, కె.శ్రీనివాస్‌, భయ్యా కుమార్‌, టి.పృథ్వీ రాజ్‌, మెర్త రాజశేఖర్‌, కృష్ణమూర్తి, పిట్టా వరప్రసాద్‌, బచ్చల కామేశ్వరరావు, పలివెల వీరబాబు, ఏనుగుపల్లి కృష్ణ పాల్గొన్నారు. అలాగే ఐడిఎల్‌ డిగ్రీ కళాశాలో రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ పి.చిరంజీవినికుమారి మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో డాక్టర్‌ టి.సత్యనారాయణ, పి.వీరబాబు, డాక్టర్‌ జి.స్టీవెన్‌ రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల కామర్స్‌ డిపార్ట్మెంట్‌ హెడ్‌ వి.నాగేశ్వరరావు, గోపాలకృష్ణ యాదవ్‌, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో బిఆర్‌.అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ శిరీష్‌, అకౌంటెంట్‌ సత్యనారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు. కరప మండలంలోని వాకాడ ఎంపిపి స్కూల్లో హెచ్‌ఎం వి.శ్రీరామరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఇఒ పి.సత్యనారాయణ పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసి ఛైర్మన్‌ దివ్యభాను, వైస్‌ ఛైర్మన్‌ దుర్గ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిఠాపురం స్థానిక ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ ఇ.కేశవరావు ఆధ్వర్యంలోనూ, వైసిపి కార్యాలయంలో మాజీ ఎంపీ వంగా గీత ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్‌ విగ్రహానికి మాల మహానాడు అధ్యక్షులు గుబ్బల రాజు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.రామకృష్ణ, దళిత బహుజన పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్‌ ఆర్‌.నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రౌతుల పూడి స్థానిక రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు కొరుప్రోలు హరిబాబు, వార్డెన్‌ వర్మ, ఉపాధ్యాయులు సింహాచలం, గంటి మల్ల సత్తిబాబు పూలమాలు వేసి నివాళులర్పించారు. కాజులూరు స్థానిక జడ్‌పి ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకను హెచ్‌ఎం పంపన కృష్ణ మూర్తి అధ్యక్షతన నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు.విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. గొల్లప్రోలు స్థానిక బాలికోన్నత పాఠశాలలో హెచ్‌ఎం చింతకాయల సూర్యప్రకాశరెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.యామిని, కె.సబిత పాల్గొన్నారు.సామర్లకోట మండల పరిషత్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ విగ్రహానికి ఎంపిపి బొబ్బరాయుడు సత్తి బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే చంద్రంపాలెం గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహానికి తహశీల్దార్‌ కె.చంద్రశేఖర్‌ రెడ్డి, రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్‌ ఎడ్ల శ్రీనివాస్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక జడ్‌పి బాలిక ఉన్నత పాఠశాలలో అంబేద్కర్‌ చిత్రపటానికి హెచ్‌ఎం యు.మీనామాధురి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కార్యాలయ ఎఒ, సీనియర్‌ అసిస్టెంట్‌, విఆర్‌ఒలు ఖాదర్‌ వల్లి, పద్మనాభం పాల్గొన్నారు. కోటనందూరు తుని పట్టణంలోని స్పేసెస్‌ డిగ్రీ కళాశాలలో శ్రీ ప్రకాష్‌ విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయవాది జిపి.మధురాగ్రేస్‌ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ఎ.రామ కృష్ణారెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెద్దాపురం స్థానిక జవహర్లాల్‌ నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, డ్రాయింగ్‌, క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివైఇఒ ఇ.ప్రభాకరశర్మ, హెచ్‌ఎం కె.శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరంలో జరిగిన కార్యక్రమంలో వైసిపి నాయకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు పాల్గొని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు. తాళ్లరేవు స్థానిక అంబేడ్కర్‌ భవన్‌ వద్ద మండల దళిత యునైటెడ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు జక్కల ప్రసాద్‌ బాబు, కాశి లక్ష్మణస్వామి, ఎలిపే నాగేశ్వరరావు, విఒఎల సంఘం అధ్యక్షులు ఈశ్వరి బాయి డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, దడాల జగదీశ్వరరావు, గోడి భాస్కరరావు దడాల బుజ్జిబాబు, దాసరి వేణుగోపాల్‌, ఎంపిటిసి సభ్యులు గుత్తుల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️