కార్మికుల జీవితాలతో ఆటలా..?

Jun 11,2024 22:48
కార్మికుల జీవితాలతో రాక్‌

ప్రజాశక్తి – సామర్లకోట

కార్మికుల జీవితాలతో రాక్‌ పరిశ్రమ యాజమాన్యం ఆటలాడుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి డి.క్రాంతికుమార్‌ మండిపడ్డారు. కార్మికుల అక్రమ తొలగింపులకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం రాక్‌ సిరామిక్స్‌ గేటు ముందు కార్మికులు ధర్నా కొనసాగించారు. ఈ ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాక్‌ సిరామిక్స్‌ యాజ మాన్యం నిబంధనలను, కార్మిక చట్టాను తుంగలో తొక్కిందన్నారు. దాదాపుగా 16 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను ఇప్పటికి ఇప్పుడు బయటకు పంపేయడం చాలా దారుణమన్నారు. కార్మికుల రక్తమాంసాలను పిండుకుతిన్న రాక్‌ యాజమాన్యం అర్ధాంతరంగా కార్మికులను రోడ్డున పడేసిందని అన్నారు. లాభాలవేటలో కార్మికులను బలిచేయడం దారుణమైన విషయమని, తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 25 మంది కార్మికులను తొలగించి 50 రోజులు దాటిన నేటికి సమస్య పరిష్కారం చేయడం లేద న్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకూ కార్మికుల పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో చంద్రశేఖర్‌, సతీష్‌, రామకృష్ణ, వరప్రసాద్‌, మల్లికార్జునరావు, గంగాధర్‌, క్రాంతి, మంగారావు, అర్జున్‌ రావు, మూర్తి, సత్యనారాయణ, చంద్రన్న, ప్రభుదాస్‌, రామచంద్రయ్య, రాజబాబు, సతీష్‌ కుమార్‌, శివ నారాయణ, సుబ్బారావు పాల్గోన్నారు.

➡️