ప్రజాశక్తి – ప్రత్తిపాడు
పౌష్టికాహార లోపాన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని ఎంఎల్‌ఎ వరుపుల సత్యప్రభ అన్నారు. శనివారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ పాల్గొని మాట్లాడారు. అంగన్‌వాడీ కార్యకర్తలు గ్రామాల్లో పౌష్టికాహార ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పౌష్టికాహార స్టాల్స్‌ను పరిశీలించి, మహిళలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.