పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 23 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి చరిత్ర సృష్టించిన సిపిఎం నేత జ్యోతిబసు 15వ వర్థంతి సందర్భంగా శుక్రవారం ఆయనకు పలువురు ఘనంగా నివాళులర్పించారు. ప్రజాశక్తి- యంత్రాంగంకాకినాడ సుందరయ్య భవన్‌లో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు దువ్వా శేషబాబ్జీ, కె.సత్తిరాజు జ్యోతిబసు చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన జ్యోతిబసు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. కార్మికుల శ్రేయస్సు కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసారని కొనియాడారు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో తొలితరం నేతగా ఉన్న జ్యోతిబసు సిపిఎం వ్యవస్థాపక పొలిట్ బ్యూరో సభ్యునిగా కష్టజీవుల హక్కుల కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విరామం లేకుండా 23 ఏళ్లు పని చేసిన జ్యోతిబసు భూ సంస్కరణలు అమలు చేసారని, పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామీణ పేదలను పాలనలో భాగస్వాములను చేసారన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్.శ్రీనివాస్, నగర కమిటీ సభ్యులు మలకా వెంకట రమణ, కె.నాగజ్యోతి, మేడిశెట్టి వెంకటరమణ, సిహెచ్.సతీష్, ఎ.ఏడుకొండలు, సిహెచ్.అజరు, టి.రాజా, రామిరెడ్డి, ప్రసాద్, అదృష్టదీపుడు పాల్గొన్నారు. పెద్దాపురం వరహాలయ్యపేటలోని యాసలపు సూర్యారావు భవనంలో నీలపాల సూరిబాబు అధ్యక్షతన నిర్వహించిన వర్థంతి సభలో సిపిఎం మండల కార్యదర్శి డి.క్రాంతి కుమార్ మాట్లాడారు. తొలుత జ్యోతిబసు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు దారపురెడ్డి సత్యనారాయణ, డి.కృష్ణ, రొంగల వీర్రాజు, కూనిరెడ్డి అరుణ, గడిగట్ల సత్తిబాబు, అరుణ్, చల్లా విశ్వనాథం పాల్గొన్నారు. పిఠాపురం స్థానిక నండూరి ప్రసాదరావు భవన్‌లో కె.నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన వర్థంతి సభలో సిపిఎం మండల కన్వీనర్ కుంచే చిన్న ఆయన చిత్రపటానికి పూలమాలవేసిన నివాళులర్పించారు. సిపిఎం నాయకులు విశ్వనాథం, సత్తిబాబు, సూర్యనారాయణ, వీరబాబు, నందీశ్వర రావు, మణి, రాజ్యలక్ష్మి, గోపాలకృష్ణ, ఎస్.శ్రీను, రాజేష్, నాగేశ్వరరావు మణికంఠ పాల్గున్నారు.
