ఎంఎల్‌సి అభ్యర్థి గోపిమూర్తి విస్తృత ప్రచారం

Nov 26,2024 23:23
బలపరిచిన పిడిఎఫ్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ

ప్రజాశక్తి – కాకినాడ

ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘా లు బలపరిచిన పిడిఎఫ్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎంఎల్‌సి అభ్యర్థి బొర్రా గోపిమూర్తి మంగళవారం నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలను సందర్శించి ఉపాధ్యాయులను కలుసుకున్నారు. మొదటి ప్రాధా న్యత ఓటును తనకు వేసి గెలిపిం చాలని అధ్యా పకులు, ఉపాధ్యాయులను కోరారు. విద్యా రంగ సమ స్యలు పట్ల శాసన మండలిలో ప్రస్తావిస్తానని తెలి పారు. ఉపాధ్యాయ ఉద్యమాలకు అండగా నిలు స్తానని, ప్రభుత్వ రంగాలు కాపాడడానికి నిజాయితీగా పోరాడతానని ఓటర్లకు హామీ ఇస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. 16 హైస్కూల్స్‌, ఒక జూనియర్‌ కళాశాల, పీజీ సెంటర్‌ను సందర్శించి అక్కడ సమస్య లను అడిగి తెలుసుకున్నారు. గోపిమూర్తి వెంట యుటిఎఫ్‌, జానవిజ్ఞాన వేదిక నాయకులు, పెన్షనర్స్‌ అసోసి యేషన్‌ నాయకులు, కాంటాక్ట్‌ ఆధ్యాపక సంఘ నాయకులు తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.

గోపిమూర్తికి జనవిజ్ఞన వేదిక మద్దతు

పిడిఎఫ్‌ బలపర్చిన ఉపాధ్యాయ నియోజకవర్గ ఎంఎల్‌సి అభ్యర్థి బొర్రా గోపిమూర్తికి జనవిజ్ఞాన వేదిక మద్దతు తెలిపింది. మంగళవారం స్థానిక యుటిఎఫ్‌ హోంలో మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యా రంగ శ్రేయస్సు, ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం నికరంగా నిలబడుతూ, ఉపాధ్యాయ, అధ్యాపకుల వాణి శాసన మండలిలో వినిపించేందుకు పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు కృషి చేయడం జరుగుతుం దన్నారు. ఎంఎల్‌సి అభ్యర్థి గోపిమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయ, అధ్యాపకులంతా తనను బలపరిచి గెలి పిస్తే షేక్‌ సాబ్జీ స్ఫూర్తితో శాసన మండలిలో నడుచు కుంటానని అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్య క్షులు కెఎంఎంఆర్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక నాయకులు, కార్యకర్తలు గోపిమూర్తి విజయా నికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బివివి.సత్యనారాయణ, యుఎస్‌ఎన్‌.రెడ్డి, రామలక్ష్మి, ఈశ్వరరావు పాల్గొన్నారు.

➡️