విజయం జనసేన పార్టీదే: నాగబాబు

May 14,2024 23:22
ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో

ప్రజాశక్తి – పిఠాపురం

ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించడం ఖాయమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె,నాగబాబు అన్నారు. మంగళ వారం కుమారపురం గ్రామంలో గోకుల్‌ గ్రాండ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని ప్రకటించిన తర్వాత నుంచి జనసైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు స్వచ్ఛందంగా ఆయన గెలుపు కోసం కృషి చేశారన్నారు. వారు చేసిన కష్టాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. నియోజవర్గ ప్రజలు పవన్‌ను సొంత మనిషిలా భావించారన్నారు. పవన్‌ ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం నియోజవర్గాన్ని దేశంలోనే అత్యున్నతమైన నియోజవర్గంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. జనసేన ఎన్నికల కో ఆర్డినేటర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే విధంగా పిఠాపురం నుంచి పవన్‌ కళ్యాణ్‌ గెలవబోతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన పార్టీ అభ్యర్థి పవన్‌ కళ్యాణ్‌కి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారని అన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి నెగ్గించుకోవాలని ప్రేమతో పని చేశారని వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో వేములపాటి అజరు, మహీందర్‌రెడ్డి, శంకర్‌ గౌడ్‌, పిల్లా శివశంకర్‌, కె తమ్మయ్యనాయుడు, స్వరూపారాణి, ఈశ్వరి, పిఎన్‌.రాజు, రమ్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

➡️