నమశ్శివాయం విజయమే లక్ష్యం కావాలి

Apr 11,2024 23:44
ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధి

ప్రజాశక్తి – యానాం

ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధి నమశ్శివాయం విజయమే లక్ష్యం కావాలని ఎంఎల్‌ఎ గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక గాజులగార్డెన్స్లో ఏర్పాటుచేసిన నమశ్శివాయం ప్రచారసభలో ఆయన మాట్లా డారు. పుదుచ్చేరిలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉండాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకే తాను ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలిచినప్పటికి యానాం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం కూటమితో గత రెండున్నర ఏళ్లుగా సఖ్యతగా ఉంటూ, పనులు పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఆ దిశలో ఒక్కోసారి రాజకీయపార్టీలకతీతంగా తాను ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. నమశ్శివాయం ఎంపిగా గెలిచి కేంద్ర మంత్రిహోదాతో మరిన్ని నిధులు సాధన అవకాశం ఉంటుందన్నారు. ఆవిధంగా గహనిర్మాణ, రుణాలు, ఇంటి స్థలాలు, పర్యాటకాభివృద్ధి, మౌళిక సౌకర్యాల కల్పనకు కేంద్రంతో నిధులు సాధించుకోవచ్చునన్నారు. ఎంపీ అభ్యర్థి నమశ్శివాయ మాట్లాడుతూ ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌ అశో క్‌ ఎల్లప్పుడూ యానాం నియోజకవర్గం అభివృద్ధికోసమే తనను కలుస్తున్నారని అన్నారు. తాను ఎంపిగా గెలిస్తే తప్ప నిసరిగా ఆయనకు పూర్తిగా సహకరిస్తానన్నారు.త్వర లోనే మూతపడిన రీజెన్సీ సిరామిక్స్‌ పరిశ్రమను పునప్రారం భించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశ్రమ చైర్మన్‌ డాక్టర్‌ జిఎన్‌.నాయుడు అన్నారు. ఇందుకోసం ఎంఎల్‌ఎ గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌, ఎన్‌డిఎ కూటమి ఎంపీ అభ్యర్థి నమశ్శి వాయం ప్రభుత్వపరంగా సహకారాన్ని అందిస్తు న్నారని అన్నారు. ఈ సందర్భంగా యానాం పారిశ్రామి కాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కూడిన అధ్యయన నివేదికను ఆయన వారికి అందించారు.

➡️