వైకాపాలోకి నానిబాబు రాజు

Apr 1,2024 16:24 #Kakinada

ప్రజాశక్తి-తాళ్లరేవు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి నానిబాబు రాజు సోమవారం తన అనుచరులతో కలిసి వైకాపాలో చేరారు. ముమ్మిడివరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నాని బాబు రాజుకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పిళ్ళంకలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు సాగి హరిబాబు, జంపన అజయ్, కనుమూరి వెంకటేశ్వరరాజు, సాగి బొజ్జిరాజు, శివరామరాజు, వైకాపా గ్రామ కమిటీ కన్వీనర్ కృష్ణంరాజు తదితరులు ఆయన వెంట ఉన్నారు.

➡️