ఐడిఎల్‌ డిగ్రీ కళాశాలతో ఒడిగోస్‌ ఎంఒయు

Nov 27,2024 22:36
ఒడిగోస్‌ ఎంఒయు ఒప్పందం చేసుకుంది.

ప్రజాశక్తి – కాకినాడ

నగరంలోని ఐడిఎల్‌ డిగ్రీ కాలేజీతో ఒడిగోస్‌ ఎంఒయు ఒప్పందం చేసుకుంది. బుధవారం ఐడిఎల్‌ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐడిఎల్‌ డిగ్రీ కాలేజీ కంప్యూటర్‌ సైన్స్‌ హెచ్‌ఒడి జీవన్‌ కాంత్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సత్యనారాయణ, అకాడమిక్‌ డైరెక్టర్స్‌ రంజిత్‌, వాసు, వైస్‌ ప్రిన్సిపల్‌ కామరాజు, ఒడిగోస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్స్‌ వార వినోద్‌, వార సత్యనారాయణ పాల్గొని ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ ఒడిగోస్‌తో ఎంఒయు చేసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ఒడిగోస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్స్‌ వార వినోద్‌, వార సత్యనారాయణ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక వ్యవస్థలో కంపెనీల యొక్క అవసరానికి తగ్గినట్టుగా విద్యార్థులను తయారు జేస్తున్న తమ సంస్థ అధికారికంగా ఐడిఎల్‌ డిగ్రీ కళాశాల విద్యార్ధులకు ఫుల్‌ స్టాక్‌, యుఐ, యుక్సకోర్సెస్‌ మీద శిక్షణ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఎంఒయు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఒడిగోస్‌ మీద ఉన్న నమ్మకంతో ఎంఒయు చేసుకున్ని కళాశాల యాజమాన్యంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు సరియైన పద్దతిలో నేర్చుకుంటే కేవలం 4 నెలలో ప్రముఖ సాప్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒడిగోస్‌ ఫౌండర్స్‌ మేరీ జ్యోతి, మేనేజర్స్‌ శిరీష, లారా, కో-ఆర్డినేటర్స్‌ మౌలిక, రామ, పద్మ, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఒయు చేసుకున్న ఒడిగోస్‌ నిర్వాహకులను సివైఎఫ్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మూర్తి రాజు ప్రత్యేకంగా అభినందించారు.

➡️