తల్లిదండ్రులు, సమాజం గర్వపడేలా రాణించాలి

Oct 29,2024 22:29
ఉన్నతంగా రాణించాలని

ప్రజాశక్తి – తాళ్లరేవు

తల్లిదండ్రులతో పాటు సమాజం గర్వపడేలా విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని ఒఎన్‌జిసి కాకినాడ అసెట్‌ ఇడి రత్నేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఒఎన్‌జిసి షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తాళ్లరేవు హైస్కూల్‌లో పలు పాఠశాలల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేశారు. తొలుతగా డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ చిత్రప టానికి ఆయన పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వర్గాలకు చెందిన విద్యార్థులు చదువులో మరింతగా రాణించాలని కోరా రు. తాళ్లరేవు హైస్కూల్లో 46 మందికి, పి.మల్లవరం హైస్కూ ల్‌కు సంబంధించి 21 మందికి సైకిళ్లు అందించారు. అలాగే ముమ్మిడివరం బక్కివారి పేట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులకు సైకిల్లు అందజేయ నున్నట్లు ఒఎన్‌జిసి విశ్రాంత అధికారి రెడ్డి గిరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒఎన్‌జిసి ప్రతినిధి కళ్యాణ్‌ చక్రవర్తి, సర్పంచ్‌ రెడ్డి అరుణ సుహాసినిదేవి, నాయకులు రెడ్డి బాబు, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు, మండల దళిత యునైటెడ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పెయ్యల రమేష్‌, సాధ్య ఫౌండేషన్‌ ప్రతినిధులు, హైస్కూల్‌ హెచ్‌ఎం. ఆశాలత, ఉప సర్పంచ్‌ పంపన రామకృష్ణ, ఎస్‌ఎం.సి ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లు పి.శ్రీమన్నారాయణ, తాతారావు, ఉపాధ్యాయులు వాకపల్లి అప్పారావు, ఉంగరాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️