ప్రజాశక్తి – కాకినాడ
ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే పిడిఎఫ్ అభ్యర్థి డివి.రాఘవులు విజయానికి ప్రతీఒక్కరూ కృషి చేయాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు అన్నారు. శనివారం పి డి ఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థి డివి.రాఘవులు ప్రచార కార్యక్రమంలో భాగంగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజును జవహార్ వీధిలోని వివేక్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాఘవులుకు ఆయన ఘనంగా స్వాగతం పలికారు. గత ఎన్నికల్లో ఐవి విజయం సాధిస్తే ప్రస్తుత ఎన్నికల్లో డివి.రాఘవులు విజయం సాధించడం ఖాయమన్నారు. పిడిఎఫ్ విజయం ప్రజాస్వామ్య ప్రగతికి చిహ్నమని అన్నారు. ఈ పర్యటనలో సిపిఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు, యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.