పిడిఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్థి రాఘవులు విస్తృత ప్రచారం

Feb 16,2025 21:21
పట్టభద్రుల నియోజకవర్గంలో

ప్రజాశక్తి – కాకినాడ

ఫిబ్రవరి 27 న జరుగబోతున్న తూర్పు- పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గంలో యుటిఎఫ్‌, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్‌, ప్రజా సంఘాల బలపరిచిన పిడిఎఫ్‌ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు ఆదివారం నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నగరంలో వివిధ ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో పని చేస్తున్న పట్టభద్రులను కలుసుకుని శాసన మండలిలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు చేస్తున్న కృషిని వివరించారు. అధికార, ప్రతిపక్షాల వైపు కాకుండా పిడిఎఫ్‌ నిరంతరం ప్రజాపక్షం నిలబడుతుందన్నారు. 2007 శాసనమండలి పునరుద్ధరణ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు 17 మంది పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు శాసన మండలికి వన్నె తెచ్చారని తెలిపారు. ఆదిyరం ఉదయం నగరంలో వివిధ ప్రాంతాల్లో వాకర్స్‌ను కలుసున్న రాఘవులు తన ఉద్యమ నేపథ్యాన్ని స్వయంగా వివరించారు. ప్రస్తుత ఎంఎల్‌సి ఇళ్ళ వెంకటేశ్వరరావు (ఐవి) స్థానంలో తనను పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థిగా ప్రతిపాదించారని రాఘవులు తెలిపారు. కాకినాడ నగరం పరిసర ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్‌, మహిళలతో పాటు ముఖ్యంగా నిరుద్యోగ పట్టభద్రులు దిడ్ల వీర రాఘవులుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో ప్రజా సంఘాల నాయకులు పలివెల వీరబాబు, కె.సత్తిరాజు, మలక వెంకటరమణ, బొజ్జా అశోక్‌, వై. నాగేశ్వరరావు, బుర్రా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️