వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శన

Apr 11,2025 23:01
పట్టణం లో ప్రదర్శన నిర్వహించారు.

ప్రజాశక్తి – పెద్దాపురం

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం ముస్లింలు పట్టణం లో ప్రదర్శన నిర్వహించారు. జుమ్మా నమాజ్‌ అనం తరం నిర్వహించిన ఈ ప్రదర్శన రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం వరకూ సాగింది. అంతకుముందు మున్సిపల్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. అనంతరం ఆర్‌డిఒ శ్రీరమణికి వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లా డుతూ బిజెపి ప్రభుత్వం ముస్లింలపై వివక్షతో కూడిన విద్వేషాన్ని రేపుతోందన్నారు. అందులో భాగంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. ముస్లింల సామాజిక, సాంస్కృతిక, ధార్మిక సంస్థలపై ఈ బిల్లు దాడిచేయ నుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి ముక్తార్‌ అలీ, ఎండి ముస్తఫా, ఆశిక్‌ ఆలీ, సయ్యద్‌ ఖాదర్‌, షేక్‌ గౌస్‌, ఎం ఎల్‌ ఆలీ, నవాబ్‌ జానీ పాల్గొన్నారు. ఈ ర్యాలీకి సిపిఎం సంఘీ భావంగా నాయకులు నీలపాల సూరిబాబు, సిరిప రపు శ్రీనివాస్‌, క్రాంతికుమార్‌, అరుణ్‌ పాల్గొన్నారు.

➡️