ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పోలేరమ్మ జాతరలో బుధవారం అర్ధరాత్రి మహిళలతో అశ్లీల నృత్యాల ప్రదర్శనలు జరిగాయి. దైవభక్తి చాటున గ్రామా దేవతల జాతరలలో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తుండడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్లీల నృత్యాలను నివారించవలసిన నాయకులే దగ్గరుండి కార్యక్రమాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు. మరికొన్ని రోజుల్లో గ్రామాలలో జరగనున్న జాతరలో అశ్లీల నృత్యాలు జరగకుండా చూడాలని పలువురు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన పోలీసు వారు పట్టించుకోకుండా ఉండడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
