హోప్‌ ఐల్యాండ్‌లో పోలింగ్‌ కేంద్రం

May 12,2024 22:49
మండలంలోని కోరంగి

ప్రజాశక్తి – తాళ్లరేవు

మండలంలోని కోరంగి పంచాయతీ పరిధిలోని హోప్‌ ఐలాండ్‌ లో ఉన్న 315 మంది ఓటర్లకు అక్కడ పోలింగ్‌ నిర్వహించడానికి 10 మంది సిబ్బందిని తరలించినట్లు తహశీల్దార్‌ శ్రీనివాస్‌ తెలిపారు. కాకినాడకు సమీపంలో సముద్రంలో ఉన్న ఈ దీవిలో పోలింగ్‌ నిర్వహించడానికి జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. సోమవారం పోలింగ్‌ అనంతరం ఇవిఎంలతో తిరిగి సిబ్బంది ముమ్మిడివరం చేరుకుంటారని ఆయన వివరించారు.

➡️