గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ

Nov 12,2024 22:19
గోడపత్రికను కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి ఆవిష్కరించారు.

ప్రజాశక్తి – కాకినాడ

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాల గోడపత్రికను కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి ఆవిష్కరించారు. మంగళవారం కలెక్ట రేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి విఎల్‌ఎన్‌ఎస్‌వి.ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతి ఏడాది నవంబరు 14 నుంచి 20వ తేదీ వరకూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారోత్స వాల్లో భాగంగా ప్రారంభం రోజున మొదలుకుని బాలల దినోత్సవం, పుస్తక ప్రదర్శన, విద్యార్థినీ, విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మే ళనం, గ్రంథాలయ ఉద్యమకారుల సంస్కరణ సభలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయన్నారు. ఈ వారోత్స వాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప గ్రంథాలయ ఇన్‌ ఛార్జ్‌ అధికారి కె.కిషోర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మీ పురం వెంకటేశ్వరరావు, గ్రంథాలయ సిబ్బంది డి.రవి కుమార్‌, ఎస్‌.రాజు, ఎం.శ్రావ్య, టి.సాయివెంకట్రావు పాల్గొన్నారు.

➡️