ప్రజాశక్తి – పెద్దాపురం : బాపట్ల జిల్లా అనంతవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎన్టీఆర్ నాటక పరిషత్తు పోటీలో పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన ప్రజానాట్యమండలి జిల్లా నాయకుడు కేదారి నాగు ఉత్తమ సహాయ నటుడిగా బహుమతి అందుకున్నారు. కొలకలూరు వారి సాయి ఆర్ట్స్ నాటక సమాజంలో పిటి మాధవ్ రచించిన జనరల్ బోగీలు నాటికలో ఆయన పోలీస్ పాత్రలో నటించారు. 3 రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 9 నాటికలు పోటీ పడ్డాయి. ఈ సందర్భంగా నాగును ప్రజానాట్యమండలి మండల అధ్యక్ష, కార్యదర్శులు మంతెన సత్తిబాబు, రొంగల వీర్రాజు, ప్రజానాట్యమండలి నాయకులు దారపురెడ్డి సత్యనారాయణ, మహపాతిన రాంబాబు, దారపు రెడ్డి కృష్ణ, స్నేహ ఆర్ట్స్ అధ్యక్షులు గొందేసి రాజా, కార్యదర్శి ఇంధన బ్రహ్మానందం, సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు చల్లా విశ్వనాథం తదితరులు అభినందించారు.
