స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆపాలి

Oct 1,2024 23:20
ప్రయివేటీకరనణను తక్షణమే ఆపాలని

ప్రజాశక్తి – కాకినాడ

ఎందరో ప్రాణబలిదాణాల ద్వారా ఏర్ప డిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరనణను తక్షణమే ఆపాలని వివిధ ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేషబాబి, సిహెచ్‌.రాజకుమార్‌, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ నిరసనకారులకు దండులు వేసి నిరసన దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై.బాబి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగాసూరిబాబు, విద్యార్థి జెఎసి నాయకులు బుల్లి రాజు, పిడిఎస్‌యు(వి) జిల్లా కార్యదర్శి శ్రీకాంత్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కో కన్వీనర్‌ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేట్‌కరణ వెంటనే ఆపాలని, ఉద్యోగుల బలవంతపు బదిలీలు, నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని, సొంత గనులు కేటాయించాలని, విశాఖ ఉక్కును సెయిల్‌లో వీలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం లడ్డుపై కాకుండా విద్యార్థి, యువజనుల భవిష్యత్తు కోసం దీక్షలు చేయాలని హితవు పలికారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ 32 మంది బలిదానాలతో ఏర్పడిందని, అలాంటి సంస్థను ప్రయివేటీకరణ చేయడం దురదృష్టమన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వలన సుమారు 20 లక్షల కుటుంబాలు బతుకుతున్నాయని, దేశ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రయివేటీకరణ ఆపకుంటే ఉమ్మడి ప్రజా సంఘాల కార్యచరణ సిద్ధం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శ్రీకాంత్‌, మణికంఠ, చిన్ని, లోవరాజు, గోపాలం, జయరాం, ఆదర్శ్‌ కార్తీక్‌, అమృత, సూర్య, ఎఐవైఎఫ్‌ నాయకులు ఎం.వీరబాబు, జామి సింహాద్రి, అనిల్‌, విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

➡️