ప్రజాశక్తి – కాజులూరు
ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్య అందుతుందని కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు. ఆదివారం మండలంలోని పల్లిపాలెం పాఠశాలలో నిర్మించిన భోజనశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ విద్యను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలన్నారు. అనంతరం కోదండరామ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్షులు భానుప్రకాష్, ప్రధాన కార్యదర్శి గణేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.