ప్రతి సమస్యకూ నాణ్యమైన పరిష్కారం

Feb 12,2024 15:58 #Kakinada
Quality solution for every problem

కార్పొరేషన్ కమిషనర్ జే. వెంకటరావు

ప్రజాశక్తి-కాకినాడ : ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి ఒక్క సమస్యకూ నాణ్యమైన పరిష్కారాన్ని అందిస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు చెప్పారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం లో భాగంగా సోమవారం డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమాలు నిర్వహించారు. అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు,వివిధ విభాగాధిపతులతో కలిసి ఆయన ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించి డయల్ యువర్ కమిషనర్ కు 9, స్పందనకు 4 దరఖాస్తులు అందజేశారు. ఆ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ జె. వెంకటరావు అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆర్థికపరమైన, న్యాయపరమైన అంశాలు మినహా ప్రతి ఒక్క సమస్యనూ సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించిన తర్వాత ఆ సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదుదారులకు కూడా తెలియజేయాలని కమిషనర్ సూచించారు.కార్పొరేషన్ కార్యాలయం వరకు రాలేని ప్రజలు స్థానికంగా ఉండే సచివాలయాలలో కూడా తమ దరఖాస్తులు అందజేయవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్ఈ పి. సత్యకుమారి,డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వి చరణ్, స్మార్ట్ సిటీ ఎస్ఈ వెంకటరావు, డిసిపి హరిదాస్, ఏసీపీ నాగశాస్త్రులు,మేనేజర్ కర్రి సత్యనారాయణ,ఈఈ మాధవి, టిపిఆర్ఓ మానే కృష్ణమోహన్, ఏవో శిరీష్, పలువురు సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు.

➡️