భక్తి శ్రద్దలతో రంజాన్‌ ప్రార్థనలు

Apr 11,2024 23:43
జిల్లాలో రంజాన్‌ పండుగను

ప్రజాశక్తి – యంత్రాంగం

జిల్లాలో రంజాన్‌ పండుగను ముస్లీములు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా మసీదుల్లో జరిగిన వేడుకల్లో రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ఇమామ్‌ల నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ముస్లీములకు రంజాన్‌ వుభాకాంక్షలు తెలిపారు.

సామర్లకోట ముస్ల్లీములు తమ పవిత్ర రంజాన్‌ పండుగను అత్యంత భక్తి శ్రద్దలతో గురువారం జరుపుకున్నారు. స్థానిక ముస్లీముల కుటుం బాలకు ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప, వైసిపి నియో జకవర్గ అభ్యర్థి ఇన్‌ఛార్జ్‌ దవులూరి దొరబాబు పాల్గొని ‘ఈద్‌ ముభారాక్‌’ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూని యర్‌ కళాశాల గ్రౌండ్‌లో జామియాతుల్‌ ఖురేషీ మస్జీద్‌ అధ్యక్షులు మహమ్మద్‌ ఇనాముల్లా ఆధ్వర్యంలో ఇమామ్‌ మహమ్మద్‌ ఫెయిజే ఆలం ప్రజలతో రంజాన్‌ ప్రార్థనలు జరిపించి రంజాన్‌ పండుగ విశిష్టతను వివరించారు. అలాగే పట్టణ పరిధిలోని కోటపేట, పెన్షన్‌ లైన్‌ మసీదులోనూ రంజాన్‌ పండుగ ప్రార్థనలు ముస్లీమ్‌ కుటుంబాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ప్రార్థనల్లో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్‌, కంటే జగదీశ్‌, వల్లూరి దొర, తాతపూడి కష్ణబాబు, కాపవ రపు కుమార్‌, దవులూరి సుబ్బారావు, ఊబా జాన్‌ మోసెస్‌, పాలిక కుసుమ చంటిబాబు, పిట్టా సత్యనారాయణ, పాగా సురేష్‌, నేతల హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

ఏలేశ్వరం రంజాన్‌ పర్వదినం పురస్కరించుకుని ముస్లీములు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం చుట్టు ప్రక్కల ప్రాంతాలకు చెందిన ముస్లీములు పాల్గొన్నారు.

కోటనందూరు తుని పట్టణంలో పలు ప్రాం తాల్లో జరిగిన రంజాన్‌ వేడుకల్లో మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రి రాజాకు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోతుల లక్ష్మణ్‌, షేక్‌ క్వాజా, ముస్లీములు పాల్గొన్నారు.

కాకినాడ రూరల్‌ స్థానిక ఎపిఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రంజాన్‌ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం పేద కుటుంబాలకు చెందిన మహిళలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్‌ శిష్ఠి, అడబాల రత్న ప్రసాద్‌, రేలంగి బాపిరాజు, రాజా, రాఘవరావు పాల్గొన్నారు.

తాళ్లరేవు మండలంలోని సుంకరపాలెం పంచాయతీ ఉస్మాన్‌ జమాతే అహ్లే హదీస్‌ మసీదులో నిర్వహించిన రంజాన్‌ వేడుకల్లో టిడిపి ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదు గురువు షేక్‌ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఆయనను ఆశీర్వచనం అందజేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్‌ తారిఫ్‌, తవాబ్‌, జహీర్‌, షేక్‌ నాన, హలీల్‌, షరీఫ్‌, టిడిపి నాయకులు మోపూరి వెంకటేశ్వరరావు, చీకట్ల నాగేశ్వర రావు, తాతపూడి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

పెద్దాపురం మండలంలోని కట్టమూరు పుంతలోని ఈద్గా మెట్టపై ఈ దుల్‌ ఫితర్‌(రంజాన్‌)సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణ పరిధిలో ముస్లింలు అధిక సంఖ్యలో ఈ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. సాహి జామియా మసీద్‌ (పెద్ద మసీదు )ఇమామ్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో నమాజ్‌ ఆచరించారు.

పిఠాపురం జబర్దస్త్‌ ఫ్రేమ్‌, నటుడు హైపర్‌ ఆది రంజాన్‌ సందర్భంగా పట్టణంలో స్థానిక వస్తాద్‌ వీధిలో ఖాజా బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థ నలో పాల్గొన్నారు. జనసేన అభ్యర్థుల విజయాన్నీ కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన గత రెండు రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో తన ప్రచారాన్ని కొనసాగి స్తున్నారు. పవిత్ర రంజాన్‌ సందర్భంగా దర్గాకు వచ్చి ముస్లీములకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చల్లా లక్ష్మి, ఎస్‌ఎం అలీ, ఎండి అహ్మద్‌, ఎస్‌కె రహీమ్‌, ఎండీ సమ్స్‌ ఉద్దీన్‌ పాల్గొన్నారు.

➡️