ప్రజాశక్తి – సామర్లకోట
ఏలేరు ప్రాజెక్టు ఆయకట్టు 53,017 ఎకరాలకు రబీ సాగుకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు సామర్లకోట ఇరిగేషన్ డిఇ ఆకెళ్ళ రవికుమార్ తెలిపారు. బుధవారం స్థానిక ఏలేరు కాలువ పరిధిలో రబీ వరి పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ ఏలేరు ప్రాజెక్టు నుంచి 1400 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా దానిలో 200 క్యూ సెక్కుల నీటిని విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇస్తున్నా మన్నారు. మిగిలిన 1200 క్యూసెక్కులు రబీ వరిసాగుకు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం జలాల విడుదల ద్వారా ఎద్దడి లేకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ పరిశీలనలో ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.