ప్రజాశక్తి – కాకినాడ
మూడు నెలల బకాయి జీతాల కోసం గత 35 రోజులుగా సమ్మె చేస్తున్న క్లాప్ వాహన డ్రైవర్లకు ఎట్టకేలకు అధికారులు రెండు నెలల బకాయి జీతాలను విడుదల చేశారు. దీంతో వారు చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించారు. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ మాట్లా డుతూ జీతాలు వేయించినందుకు అధికా రులకు, కాంట్రాక్టర్‌కు ధన్యవాదాలు తెలి పారు. మిగిలిన సమస్యలను భవిష్యత్తులో పరిష్కరించాలని కోరారు. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్ట్ డ్రైవర్లకు జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలను చెల్లిస్తున్నారని, అదేరీతిలో క్లాప్ వాహన డ్రైవర్లకు కూడా చెల్లించాలని కోరారు. కట్ చేసుకున్న పిఎఫ్ సొమ్మును వెంటనే కార్మికులు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 7వ తేదీన జీతం పడేవిధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, క్లాప్ వాహన డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఇస్మాయిల్, శివశంకర్, కుమార్, రాజు, వెంకటేష్, దుర్గబాబు, శివ శ్రీను, రమణ, టి.శ్రీను పాల్గొన్నారు.