గ్రామాల అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష

Apr 18,2024 22:54
మండల పరిధి లోని

ప్రజాశక్తి – పెద్దాపురం

మండల పరిధి లోని గ్రామ పంచాయితీలకు సంబంధించి 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో అభివీద్ధి ప్రణాళికపై సమీక్షా సమా వేశం జరిగింది. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా పంచా యతీ వనరుల కేంద్రం బృందం పంచాయతీల కార్యదర్శులు, సచివా లయాల డిజిటల్‌ అసిస్టెం ట్లుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇఒపిఆర్‌డి నక్కా సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కరప ఇఒపిఆర్‌డి బిఎ.సత్య నారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సుస్థిర అభివృద్ధికి జిపిడిపి ఎంతో దోహద పడుతుందన్నారు. పంచాయితీల వారీగా రూపొందించిన అభివీద్ధి ప్రణాళికలను పరిశీలించి తుది నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామన్నారు. అనంతరం గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, సునీల్‌ కుమార్‌, ప్రసన్నాంజనేయులు, ఎడిపిఎం జి.స్వామి పాల్గొన్నారు.

➡️