ప్రజాశక్తి – పెద్దాపురం
నియోజకవర్గ పరిధిలో ఓటర్ జాబితాపై బిఎల్‌ఒలు, ఇఆర్‌ఒలకు శుక్రవారం స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌డిఒ శ్రీరమణి మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ ఓటర్ నివాసానికి 2 కిలోమీటర్ల దూరం మించి ఉండకూడదన్నారు. పోలింగ్ బూత్‌లో 800 నుంచి 1200 మంది లోపులో మాత్రమే ఓటర్లు ఉండాలన్నారు ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను వారం రోజులలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ సిహెచ్.వెంకటలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.