ప్రజాశక్తి – ఏలేశ్వరం
ఏలేశ్వరం డిపోకి చెందిన డ్రైవర్ ఎస్‌వి.రమణ అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలని కార్మికులు చేపట్టిన ఆందోళన ఆదివారం 23వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మిక జెఎసి నాయకులు కె.త్రిమూర్తులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా టిమ్ డ్రైవర్లను సస్పెన్షన్లు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 23 రోజులుగా గేట్ ధర్నాలు, రిలే దీక్షలు నిర్వహిస్తూ, కార్మికులంతా ఎర్ర బ్లాడ్జిలతో విధులకు హాజరవుతూ తమ నిరసనను తెలుపుతున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. 4 రోజులుగా తుని, ఏలేశ్వరం, కాకినాడ డిపోల్లో రిలే నిరహారదీక్షలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం డ్రైవర్ ఎస్‌వి.రమణపై అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన రాష్ట్రవ్యాప్తం అవుతుందని హెచ్చరించారు. ఆదివారం బి.రాజు, బిఎల్‌వి.రమణ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు యుబి.కుమార్, ఎన్‌పి.రావు, తదితరులు పాల్గొన్నారు.