ప్రజాశక్తి – ఏలేశ్వరం
రైతులు, ఖాతాదారుల సౌకర్యార్థం ఎస్‌బిఐ సేవలను మరింత విస్తృతం చేస్తున్నట్లు ఎర్రవరం ఎస్‌బిఐ ఎల్‌హెచ్‌ఒ, మేనేజర్లు సురేష్, ఎలిషానాయుడు అన్నారు. శనివారం మండలంలోని ఎర్రవరంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్‌లైన్ ద్వారా ఖాతాదారులకు 44 రకాల సేవలను విస్తృతం చేస్తున్నట్లు చెప్పారు. రైతుల రుణాలతోపాటు, తదితర లావాదేవీలను ఈ సేవలు కిందకు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఖాతాదారులు సౌకర్యార్థం 1800 1234 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా రైతులు రుణాలు ఇతర అంశాలు తెలుసుకునే సౌకర్యం సులభం అవుతుందన్నారు. అనంతరం ఉత్తమ ఖాతాదారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు మైరాల కనకారావు, తోట వెంకటేశ్వరరావు, బిశెట్టి ప్రసాద్, దుర్గారావు, బుద్ధ లోవరాజు, తోట గంగాధర్, రాయి బాబ్జి, చిలకమర్తి సుబ్రమణ్యం ఉన్నారు.