ప్రజాశక్తి – కాకినాడ
భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా గర్ల్స్ కమిటీని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.వరహాలు, ఎం.గంగా సూరిబాబు నూతనంగా ఏర్పాటు చేశారు. జిల్లా గర్ల్స్ కన్వీనర్ గా జి.చిన్ని, కో కన్వీనర్లుగా అమృత, బిందు, కావ్య, కమిటీ సభ్యులుగా హేమ, మంజుల, మల్లేశ్వరి, శివమణి, హేమ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ విద్యారంగంలో ఉన్న సమ్యసలపై ఈ కమిటీ కృషి చేస్తుందన్నారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమ్యసలపై రాజీలేని పోరాటం చేస్తామని, అమ్మాయిలకు ఈవ్ టీజింగ్, తమంతట తాము ఎలా రక్షించుకోవాలో అనే విషయాలపై అవగాహన కల్పించడం కోసం కమిటీ కృషి చేస్తుందన్నారు. మహిళలకు విద్యా, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.