సామాజిక విప్లవకారుడు పూలే

Apr 11,2025 23:03
పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రజాశక్తి – యంత్రాంగం

కాకినాడ స్థానిక జిజిహెచ్‌ సెంటర్లోని జ్యోతిరావుపూలే విగ్రహానికి కలెక్టర్‌ షాన్‌మోహన్‌, ఎంపి సానా సతీష్‌కుమార్‌, ఎంఎల్‌సి పేరాబత్తుల రాజశేఖరం, ఎంఎల్‌ఎ వనమాడి వెంకటేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 200 ఏళ్ల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుటున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో అర్థం చేసుకోవాలన్నారు. వెనుకబడిన వర్గాల విద్య కోసం, మానవ హక్కుల కోసం పూలే ఎంతో పోరాడారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కొరకు డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌, జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని వారి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిసి, కాపు, ఇబిసి కార్పొరేషన్ల ద్వారా సుమారు రూ.11.86 కోట్ల రుణాలను 513 మంది లబ్ధిదారులకు చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమాధికారి ఎం.లల్లి, బిసి కార్పొరేషన్‌ ఇడి అద్దంకి శ్రీనివాసరావు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, బిసి సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు. జెఎన్‌టియుకెలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్య స్కాన్స్‌ సిఎండి డాక్టర్‌ కె.వెంకటరమణ, రెక్టార్‌ ప్రొ కెవి.రమణ, ఇన్‌ఛార్జ్‌ రిజిస్ట్రార్‌ ప్రొ వి.రవీంద్రనాథ్‌, ఒఎస్‌ ప్రొ డి. కోటేశ్వరరావు తదితరులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కాకినాడ రూరల్‌ తొలితరం సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అని గ్రంథాలయ సంస్థ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు అన్నారు. గురువారం అడబాల ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రమణయ్యపేటలో పూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వితంతువులు, అనాధ పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా శరణాలయం స్థాపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్‌, డాక్టర్‌ శిరీష, ప్రసాద్‌నాయుడు, దిలీప్‌కుమార్‌, రాజా పాల్గొన్నారు. గండేపల్లి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చల్లగళ్ల దొరబాబు, ఎంపిడిఒ నాతి బుజ్జి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రౌతులపూడి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పూలే చిత్రపటానికి ఎంపిడిఒ శివరామకృష్ణయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పూలే జయంతిని నిర్వహించారు. పూలే చిత్రపటానికి ఎంపిడిఒ కె.స్వప్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి సాగర్‌కుమార్‌, పంచాయతీ సెక్రటరీ రాజు, ఎఒ జి.వెంకటరామలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. పిఠాపురం టిడిపి కార్యాలయంలో మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌వివిఎస్‌.వర్మ, వైసిపి కార్యాలయంలో మాజీ ఎంపి వంగా గీత, ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ కేశవరావు, ఎల్‌ఐసి కార్యాలయంలో మేనేజర్‌ రాము పూలే చిత్రాపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాళ్లరేవు స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో కెవిపిఎస్‌ నాయకుడు విప్పర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన పూలే జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి దొమ్మేటి సామ్యూల్‌సాగర్‌, సర్పంచ్‌ వెంటపల్లి నూకరాజు, ఎంపిటిసి సభ్యులు పోతుల రత్నకుమారి, ప్రజాసంఘాల నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు, ఇతర నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. టిడిపి కార్యాలయంలో మండల కార్యదర్శి కట్టా త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన పూలే జయంతి వేడుకల్లో ఎంఎల్‌ఎ దాట్ల సుబ్బరాజు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కరప స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పూలే జయంతిని నిర్వహించారు. పూలే చిత్రపటానికి ఎంపిపి పెంకె శ్రీలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి సలాది శ్రీనివాసరావు, మండల పరిషత్‌ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. పెద్దాపురం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్బు, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో పూలే జయంతిని నిర్వహించారు. బుద్ధా శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా కార్యదర్శి రవివర్మ, సిఐటియు నాయకులు బుడతా రవీంద్ర, సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు చల్లా విశ్వనాథం, కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ్‌కుమార్‌, దేవత రాజేష్‌కుమార్‌, కూనిరెడ్డి నరసింహంమూర్తి, అమృత, నమ్రత పాల్గొన్నారు. అలాగే స్థానిక రెవిన్యూ డివిజనల్‌ కార్యాలయంలో ఆర్‌డిఒ శ్రీరమణి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఎఒ మాధవరావు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్తిపాడు ఆల్‌ ఇండియా లాయర్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ జస్టిస్‌ (ఐలాజ్‌) ఆధ్వర్యంలో పూలే జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐలాజ్‌ రాష్ట్ర కార్యదర్శి బుగత శివ, ధర్మవరంలో వైసిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు. పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోలా తాతబాబు, బొల్లు నాగేశ్వరరావు, అవసరాల దేవి, జోగా ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️