మహిళలకు ప్రత్యేక హెల్త్‌ చెకప్‌ పోస్టర్‌

Mar 9,2025 22:41
హెల్త్‌ చెకప్‌ పోస్టర్‌ను మెడికవర్‌ హాస్పటల్స్‌ విడుదల చేసింది.

ప్రజాశక్తి – కాకినాడ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక హెల్త్‌ చెకప్‌ పోస్టర్‌ను మెడికవర్‌ హాస్పటల్స్‌ విడుదల చేసింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపిఎస్‌ అధికారిణి సుస్మితా రాంనాథన్‌, డాక్టర్‌ శ్యామల పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని అన్నారు. మహిళలు కుటుంబాల్లోనే కాదు, సమాజ అభివృద్ధిలోనూ కీలక భూమికను పోషిస్తారని, అలాంటి వారికి ఆరోగ్యం కూడా ఎంతో అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమములో మహిళలకు సమగ్ర ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రత్యేక హెల్త్‌ ప్యాకేజీని ఆవిష్కరించారు. ఈ ప్యాకేజీ ద్వారా ప్రజలకు అధునాతన వైద్య సేవలు, నిర్దిష్ట ఆరోగ్య పరీక్షలు, అవసరమైన చికిత్సలు మరింత అందుబాటులోకి రానున్నాయని మెడికవర్‌ హాస్పిటల్స్‌ హెడ్‌ శుభాకరరావు అన్నారు. మహిళల కోసం ప్రత్యేక హెల్త్‌ ప్యాకేజీ గురించి వివరించారు. రక్త పరీక్షలు, ఆల్ట్రాసౌండ్‌ స్కాన్‌, థైరాయిడ్‌, విటమిన్స్‌, పాప్స్మియర్‌, గైనకాలజిస్ట్‌, జనరల్‌ మెడిసిన్‌ వైద్యులు సూచనలు అతి తక్కువ ఖర్చుకి అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికవర్‌ హాస్పిటల్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గౌతమ్‌రామ్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️