ప్రజాశక్తి – పెద్దాపురం
డివైఎఫ్‌ఐ, ఐద్వా, సిఐటియు, పిఎన్‌ఎం, పిసిసి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. సోమవారం స్థానిక నువ్వుల గుంట వీధి, సుందరయ్య కాలనీ, వరహాలయ్య పేట, కృష్ణుని గుడి సెంటర్‌లలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలకు యుటిఎఫ్ నాయకులు జయశ్రీ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకులు కూనిరెడ్డి అరుణ, రొంగల సుబ్బలక్ష్మి, సిఐటియు నాయకులు కరక సుబ్బలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నా మన్నారు. ఈనెల 14వ తేదీన జరిగే బహుమతి ప్రధానోత్సవ సభలో విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్య క్రమంలో సిఐటియు నాయకులు గాడి సత్యవతి, సిరపరపు శ్రీని వాస్, పిసిసి కార్యదర్శి రొంగల అరుణ్‌కుమార్, పిఎన్‌ఎం నాయకులు దారపురెడ్డి కృష్ణ, మహపాతిన రాంబాబు, అమృత, నమ్రత, బంగారురాజు, క్రాంతికుమార్, కూనిరెడ్డి అప్పన్న పాల్గొన్నారు.