శ్రీ ప్రకాష్‌ విద్యార్థుల విజయకేతనం

May 14,2024 23:24
సిబిఎస్‌ఇ ప్రకటించిన

ప్రజాశక్తి – కోటనందూరు

సిబిఎస్‌ఇ ప్రకటించిన 10, ప్లస్‌ 2 ఫలితాలలో తుని శ్రీ ప్రకాష్‌ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారని విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్‌.విజయప్రకాష్‌ తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో షేక్‌ నజ్నీన్‌ 486, పెనుమత్స వర్షిణి 485, కృపాలిని పట్జోషి 484 సాధించారని తెలిపారు. ప్లస్‌ 2 ఫలితాల నందు వెదురుపాక విజరు రిషి 91 శాతం సాధించి అగ్రగాములుగా నిలిచారని, నూటికి నూరుశాతం ఉత్తీర్ణతా శాతంతో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని వివరించారు. మాథ్స్‌, తెలుగు సబ్జెక్టుల్లో తమ విద్యార్థులు 100కి 100 మార్కులు సాధించడం హర్షణీయమన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను విద్యా సంస్ధల అధినేత సిహెచ్‌వికె.నరసింహారావు, విద్యార్థులు, ఉపాధ్యా యులు, తల్లితండ్రులు అభినందించారు.

➡️