‘చెకుముకి’లో విద్యార్థుల ప్రతిభ

Oct 1,2024 23:22
వెలికి తీసేందుకు నిర్వహించిన

ప్రజాశక్తి – యంత్రాంగం

ఏలేశ్వరం విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు నిర్వహించిన చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌లో ఏలేశ్వరం శ్రీవిద్య విద్యాసంస్థల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం జి.శ్రీకాంత్‌ మాట్లాడారు. తమ పాఠశాల 8వ తరగతి విద్యార్థి జి.శాంతివర్ధన్‌, 9వ తరగతి విద్యార్థిని షేక్‌ సన, 10వ తరగతి విద్యార్థి వి.హరిప్రియ బృందం 40 మార్కులకు గాను 32 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని అన్నారు. విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్‌ టివి.నాయుడు, ప్రిన్సిపల్‌ టి.దమయంతి, ఎ.చైతన్య ఉపాధ్యాయులు అభినందించారు. కాజులూరు స్థానిక జడ్‌పి ఉన్నత పాఠశాలలో మండల జనవిజ్ఞాన వేదిక కన్వీనర్లు శీరం దుర్గాప్రసాద్‌, రాయుడు సుధీర్‌ ఆధ్వర్యంలో చెకుముకి పోటీలు నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం పంపన కృష్ణ మూర్తి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఇఒ ఎస్‌.డేవిడ్‌ మాట్లాడారు. సీనియర్స్‌ విభాగంలో ప్రథమ స్థానంలో కాజు లూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు, జూనియర్స్‌ విభాగంలో ప్రథమ స్థానంలో మంజేరు ఉన్నత పాఠశాల విద్యార్థులు నిలిచారు. రౌతులపూడి స్థానిక జడ్‌పి ఉన్నత పాఠశాలలో చెకుముకి పోటీలు నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం కోళ్ల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో సీనియర్స్‌ భాగం లో రౌతులపూడి పాఠశాల ప్రథమ బహుమతి, జూనియర్స్‌ భాగంలో శ్రీహర్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రథమ బహుమతి లభించింది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నేతలు అచ్చిరాజు, ఉపాధ్యా యులు వెంకటరమణ, వరప్రసాద్‌ పాల్గొన్నారు. కరప స్థానిక హైస్కూల్లో చెకుముకి సంబరాలు నిర్వహించారు. గురజనాపల్లి హైస్కూల్‌ విద్యార్థులు సీనియర్‌ విభాగంలో ప్రథమ స్థానం లోనూ నిలిచారు. ప్రయివేటు స్కూల్స్‌ నుంచి ఎస్తేరు పబ్లిక్‌ స్కూల్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ లు కెవి.కృష్ణవేణి, పి.సత్యనారాయణ, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి వి.శ్రీరామారావు, హెచ్‌ఎం శ్రీనివాస్‌, యంగ్‌ మైండ్‌ సంస్థ కన్వీనర్‌ వెంకటరమణ, అలీమ్‌ పాల్గొన్నారు. ప్రత్తిపాడు స్థానిక జడ్‌పి ఉన్నత పాఠశాలలో చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల సీనియర్స్‌ విభాగంలో ధర్మ వరం ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రయివేట్‌ పాఠశాలల విభాగంలో అఖిల్‌ టాలెంట్‌ స్కూల్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో మండల యుటిఎఫ్‌ అధ్యక్షుడు కోడి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి డి.రాజబాబు, జిల్లా ఉపాధ్యక్షులు వివి.రమణ, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌ రామలింగేశ్వర రావు, జిఎస్‌ ప్రసాద్‌ బాబు పాల్గొన్నారు.

➡️