చైతన్యానికి సమ్మర్‌ క్యాంపుల దోహదం

Jun 10,2024 22:37
విద్యార్థుల్లో సామాజిక

ప్రజాశక్తి – పెద్దాపురం

విద్యార్థుల్లో సామాజిక, వైజ్ఞానిక చైతన్యా నికి వేసవి శిబిరాలు దోహదం చేస్తాయని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్‌ చెలికాని స్టాలిన్‌ అన్నారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన వేసవి శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. చిల్డ్రన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు కూనిరెడ్డి అరుణ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మార్కులు, ర్యాంకులు చుట్టూ చదువులు పరిభ్రమిస్తున్న తరుణంలో పాఠశాలలు, తల్లిదండ్రులు విస్మరించిన అనేక సామాజిక, సాంస్కృ తిక, వైజ్ఞానిక అంశాలు ఈ వేసవి శిబిరాల ద్వారా విద్యార్థులకు అవగతమవుతాయన్నారు. ప్రశ్నించడం ద్వారా వాస్తవాలను తెలుసుకోవడం అలవడుతుం దన్నారు. ఈ వేసవి శిబిరం నిర్వాహకులను, ప్రోత్సా హకులను ఆయన అభినందించారు. చేనేత సొసైటీ అధ్యక్షులు ముప్పన వీర్రాజు మాట్లాడుతూ ఇటువంటి సమ్మర్‌ క్యాంపులు నిర్వహించడం ద్వారా బాలల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ జోష్యుల కృష్ణబాబు మాట్లాడుతూ ఇటువంటి సమ్మర్‌ క్యాంపులను ప్రోత్సహించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సభలో రోటరీ బ్లడ్‌ బ్యాంక్‌ చౌదరి, గంగాధరుడు, నక్షత్ర డెంటల్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ జమ్మి శిరీష, గురుదేవ హాస్పిటల్‌ డాక్టర్‌ త్రినాథ్‌, మన పెద్దాపురం ఫేస్‌బుక్‌ అడ్మిన్‌ పెదిరెడ్డి నరేష్‌, మిషన్‌ అన్నపూర్ణ సహాయ నిధి వ్యవస్థాపకులు దేవత రాజేష్‌ కుమార్‌, కిరణ్‌ కంటి ఆసుపత్రి శివ గణేష్‌, జి ప్రభాకర్‌ వర్మ, బేబీ రత్నం, చిల్డ్రన్స్‌ క్లబ్‌ గౌరవాధ్యక్షులు బుద్ధా శ్రీనివాస్‌ తదిత రులు మాట్లాడారు. ఈ సభలో రోటరీ బ్లడ్‌ సెంటర్‌ ద్వారా చిల్డ్రన్స్‌ క్లబ్‌కు స్మార్ట్‌ ప్రొజెక్టర్‌, రాజ్‌ కంప్యూటర్‌ తరుపున పార్వతీశం స్క్రీన్‌ను అందజేశారు. ఈ సమ్మ ర్‌ క్యాంపు లో పాల్గొన్న విద్యార్థులందరికీ మిషన్‌ అన్నపూర్ణ సహాయనిధి దాతల సహకారంతో దేవత రాజేష్‌కుమార్‌ విద్యార్థులకు ఉపయోగపడే వాటర్‌ బాటిల్స్‌, ముప్పన వీర్రాజు కాంపస్‌ బాక్సులు, పెన్ను లు పంపిణీ చేశారు. అనంతరం వివిధ పోటీల్లో విజేత లకు బహుమతులు అందజేశారు. సమ్మర్‌ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్‌ క్లబ్‌ అధ్యక్ష, కార్య దర్శులు కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ్‌కుమార్‌, కోశాధికారి కె.రవికుమార్‌, మంజుల, శ్యామ్‌ కుమార్‌, పవన్‌, సాయి, బంగారం, సాయికృష్ణ, మణికంఠ, నేహా, రేణుక పాల్గొన్నారు.

➡️