ప్రతి గ్రామాన్నీ స్వచ్ఛతంగా తీర్చిదిద్దాలని పలువురు పిలుపు ఇచ్చారు. బుధవారం పలుచోట్ల స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాశక్తి-యంత్రాంగంకాకినాడ రూరల్ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛతా గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. రూరల్ మండలం వాకలపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్.. జిల్లా పరిషత్ సిఇఒ వివివిస్.లక్ష్మణ రావు, జిల్లా పంచాయతీ అధికారి కె.భారతి సౌజన్య ఇతర అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులు, విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లోని విజేతలకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం వాకలపూడి గ్రామంలో గ్రీన్ అంబాసిడర్ గా ఉత్తమ సేవలు అందించిన నలుగురు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. పాఠశాల ఆవరణంలోని మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండలం ప్రత్యేక అధికారి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి జె.సత్యవతి కాకినాడ రూరల్ మండలం ఎంపిడిఒ కె.స్వప్న పాల్గొన్నారు. కరప గ్రామంలో స్వచ్ఛతాహి సేవపై గ్రామ సభ నిర్వహించారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. చెత్తతో సంపద కేంద్ర వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపిడిఒ కె.అప్పారావు ఆధ్వర్యంలో ప్రమాణం చేయించారు. అనంతరం మొక్కలను నాటారు. గ్రామ సర్పంచ్ ఆశాజ్యోతి, ఎంపిపి శ్రీలక్ష్మి, జెడ్‌పిటిసి యాళ్ల సుబ్బారావు, ఎంపిడిఒ అప్పారావు, పంచాయతీ కార్యదర్శి సునీల్, ఇఒపిఆర్డి సత్యనారాయణ, గ్రామ సర్పంచులు రామారావు, చింత బుజ్జి, విజయరాయుడుపాలెం సర్పంచ్ రాఘవ, కరప పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్స్, అంగన్వాడీ లు, డ్వాక్రా యానిమేటర్స్, గ్రామస్తులు పాల్గొన్నారు.సామర్లకోట మున్సిపాలిటీలో పని చేస్తున్న పలువురు పారిశుధ్య కార్మికులకు ఉత్తమ సేవా పురస్కారాలను అందజేశారు. గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పురస్కారాలను మున్సిపల్ ఛైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి అందజేశారు. ఇటీవల విజయవాడ వరదల ప్రాంతం లోనూ, స్థానికంగా ఏలేరు వరద ప్రాంతాల్లో రాత్రనక, పగలనక కష్టపడి పారిశుధ్య సేవలు అందించిన సందర్బంగా సుమారు 15 మంది కార్మికులకు ప్రశంసా పత్రాలు, నూతన వస్త్రాలను అందజేసి వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఊబా జాన్ మోసెస్, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, కౌన్సిలర్లు బలుసు వాసు, పాగా సురేష్ కుమార్, పిట్టా సత్య నారాయణ, పితాని కష్ణ, మర్రి శేషారావు, వైసీపీ నాయకులు గంగిరెడ్డి కృష్ణమూర్తి, చిట్టిమాని శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, సానిటరీ మేస్త్రీలు, కార్మికులు పాల్గొన్నారు. గండేపల్లి ఆదిత్య యూనివర్సిటీ విద్యార్థులు కాకినాడలోని ఎన్‌టిఆర్ బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పరిసరాలను శుభ్రం చేసినట్టు యూనివర్సిటీ డిప్యూటీ ప్రో ఛాన్సిలర్ డాక్టర్ ఎం.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు సాగర తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డ్‌కు పంపించినట్లు జెఎన్‌టియు ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ జి.శ్యామ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్. ఆఫీసర్ బి.రాంబాబు, పరిణయశ్రీ, ప్రశాంతి, విద్యార్థులు, జాతీయ సేవా ఫతఖ: వాలంటీర్స్ పాల్గొన్నారు.సూరంపాలెంలో గల పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో డిజిఎం పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై అవగాహన కలిగి ఉండాలని, మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని, ఇది సమాజ శ్రేయస్సుకి తోడ్పడుతుందని తెలిపారు. ర్యాలీకి ముందుగా రహదారికి ఇరువైపులా శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు కోటేశ్వరరావు, ఎఎస్‌ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.తాళ్లరేవు మండలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్వచ్ఛతాహి సేవ ముగింపు కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్, ఎంఎల్‌ఎ దాట్ల సుబ్బరాజు చొల్లంగిపేట పంచాయితీ పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ గంటి హరీష్ మాధుర్ విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పరిశుభ్రత కోసం బాధ్యతగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ మట్టపర్తి అనుపమ, తహశీల్దారు పితాని త్రినాథ్, ఇఒపిఆర్‌డి మల్లాడి భైరవమూర్తి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, ఆర్‌ఐ రామకృష్ణ, స్థానిక పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.